కర్నూలు నుంచి అమరావతికి లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్‌ను తరలించరాదని వైయస్ఆర్‌సీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు కర్నూలు కలెక్టర్ రంజిత్ భాషకు వినతి పత్రం అందజేశారు వైయస్ఆర్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, మేయర్ బీవై రామయ్య, న్యాయవాదులు మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే కర్నూలు జిల్లా చాలా నష్టపోయింది. కర్నూలుకు వైఎస్ జగన్ తీసుకువచ్చిన సంస్థలను చంద్రబాబు తరలిస్తున్నారు.
కేంద్రాన్ని ఒప్పించి వైయస్ జగన్ కర్నూలుకు లా వర్సిటీని తెచ్చారు. సీమకు చంద్రబాబు చేస్తున్న అన్యాయంపై ఆందోళన చేస్తాం. అధికారంలోకి వచ్చిన ప్రతీసారి చంద్రబాబు.. కర్నూలుకు నష్టం చేస్తున్నారు. ప్రజా ఉద్యమాల ద్వారా కర్నూలు జిల్లాను కాపాడుకుంటాం. చంద్రబాబు లా యూనివర్సిటీని తరలించుకుపోతుంటే కూటమి ప్రభుత్వంలోని జిల్లా నేతలు ఎందుకు మాట్లాడటం లేదు? అని ప్రశ్నించారు.