రేపు అహ్మదాబాద్ వేదికగా టీమిండియా-ఆసీస్ మధ్య ఫైనల్ పోరు జరుగనుంది. ఈ నేపథ్యంలో ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఫైనల్ మ్యాచును నిలిపివేయాలని హెచ్చరిస్తూ ఓ వీడియోను విడుదల చేశాడు. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లు, 2002 గుజరాత్ అల్లర్ల గురించి పేర్కొంటూ మతపరంగా ఓ వర్గం ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశాడు.