నేడు జరిగే ఫైనల్లో టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. అహ్మదాబాద్ పిచ్ సాధారణంగా బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. కానీ ఈ WCలో ఇక్కడ ఆడిన 4 మ్యాచ్ల్లో ఒక్కటి కూడా 300 పరుగులు చేయలేకపోయింది. తొలుత బ్యాటింగ్ చేసే జట్టు 315 పరుగులు చేస్తే విజయం సాధ్యమని, ఛేదించడం కష్టమని పిచ్ క్యూరేటర్ తెలిపారు. రెండో బ్యాటింగ్ సమయంలో వికెట్ నెమ్మదించి మలుపు తిరుగుతుందని అంటున్నారు.