వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్‌కు భారత్ -ఆస్ట్రేలియా జట్లు యుద్ధ పోరుకి సిద్ధంగా ఉన్నాయి. 45 రోజుల్లో 48 మ్యాచ్‌లు ఆడి.. చాంపియన్‌ను నిర్ణయించే తుది పోరుకు సమయం ఆసన్నమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్త్, ఆస్టఆస్ట్రేలియా మధ్య ప్రపంచకప్ 2023 ఫైనల్ ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది. సొంతగడ్డపై అభిమానుల మద్దతుతో మూడో టైటిల్ పై భారత్ దృష్టి సారిస్తోంది.
నేడు జరిగే ఫైనల్‌లో టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. అహ్మదాబాద్ పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. కానీ ఈ WCలో ఇక్కడ ఆడిన 4 మ్యాచ్‌ల్లో ఏ ఒక్కటీ 300 పరుగులు చేయలేకపోయింది. తొలుత బ్యాటింగ్ చేసే జట్టు 315 పరుగులు చేస్తే గెలిచే అవకాశం ఉందని, ఛేదించడం కష్టమని పిచ్ క్యూరేటర్ తెలిపారు. రెండో బ్యాటింగ్ చేసే సమయంలో వికెట్ నెమ్మదించి టర్న్ లభిస్తుందని అంటున్నారు.