భారత్-ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మరికాసేపట్లో జరగనుంది. ఈ క్రమంలో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్బిన్నీ రోహిత్ సేనకు పలు సూచనలు చేశాడు. ‘‘ఈ టోర్నీలో టీమిండియా మంచి క్రికెట్ ఆడింది. అయితే.. ఆస్ట్రేలియాను తేలికగా తీసుకోవద్దు. వాళ్లు కూడా బాగా ఆడుతున్నారు. ఇప్పటికే ఐదు సార్లు ఛాంపియన్లుగా నిలిచారు. భారతే టైటిల్ గెలుస్తుందని ఆశిస్తున్నాను’’ అని రోజర్బిన్నీ తెలిపాడు.