వన్డే ప్రపంచకప్-23లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’గా ఎవరు నిలుస్తారనే దానిపై భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ స్పందించాడు. అద్భుతమైన ఓపెనింగ్‌తో జట్టుకు శుభారంభం అందిస్తున్న రోహిత్‌శర్మతోపాటు టోర్నీలో అత్యధిక పరుగులతో అగ్రస్థానంలో ఉన్న కోహ్లీని కాదని.. పేస్ సంచలనం షమీ వైపు యువీ మొగ్గు చూపాడు. అలాగే హార్దిక్‌పాండ్య లేనిలోటు ఎక్కడా కనిపించలేదని.. రిజర్వ్ బెంచ్ చాలా బలంగా ఉందన్నాడు.