వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో భారత్‌ను ఓడించి ఆస్ట్రేలియా కప్ సొంతం చేసుకుంది. కప్ గెలిచిన ఆనందంలో ఆస్ట్రేలియా జట్టు సభ్యులు పార్టీ చేసుకున్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా క్రికెటర్ మిచెల్ మార్ష్ ప్రపంచకప్ ట్రోఫీని తన ముందు ఉంచుకుని దానిపై రెండు కాళ్లు పెట్టినట్లు ఉన్న ఓ ఫోటో వైరల్‌గా మారింది. మార్ష్‌ను విమర్శిస్తూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రపంచకప్‌పై కాలు పెట్టి బీరు తాగుతూ ఓ ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఫోజులిచ్చాడు. దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసీస్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ WCపై కాళ్లు పెట్టి, బీర్ తాగాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆసీస్ ప్లేయర్లు ఇలా ప్రవర్తించడం కొత్తేమే కాదు. గతంలో 2008లో ఛాంపియన్స్ ట్రోఫీ తీసుకునే సమయంలో కూడా BCCI ప్రెసిడెంట్‌తో ఆసీస్ అమర్యాదగా ప్రవర్తించింది.