వెస్టిండీస్ మాజీ క్రికెటర్, రెండుసార్లు ప్రపంచకప్ విజేత మార్లోన్ శామ్యూల్స్‌పై ఐసీసీ ఆరేళ్ల నిషేధాన్ని విధించింది. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు అవినీతి నిరోధక కోడ్‌ను ఉల్లంఘించినందుకు శామ్యూల్స్ దోషిగా తేలాడు.ICC ఇంతకుముందు సెప్టెంబర్ 2021లో శామ్యూల్స్‌పై మొత్తం నాలుగు ఆరోపణలపై అభియోగాలు మోపింది. 2023 ఆగస్టులో ఆ నేరాలకు ఈ మాజీ వరల్డ్ కప్ ప్లేయర్ దోషిగా తేలాడు.వెస్టిండీస్ తరఫున రెండు T20 ప్రపంచ కప్ ఫైనల్స్‌లో సభ్యుడిగా ఉన్న మార్లోన్ శామ్యూల్స్‌పై ఆరేళ్ల నిషేధం నవంబర్ 11, 2023 నుండి ప్రారంభమవుతుందని ICC ధృవీకరించింది. ఈ క్రమంలో అతను ఎలాంటి క్రికెట్ ఆడకూడదు. దీని ప్రకారం 2029 వరకు శామ్యూల్స్ క్రికెట్ లో కనిపించడు. శామ్యూల్స్ దాదాపు రెండు దశాబ్దాల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడాడని.. తన క్రికెట్ కెరీర్ లో ఎన్నో అవినీతి వ్యతిరేక సెషన్లలో పాల్గొన్నాడని ఐసీసీ హెచ్‌ఆర్ అండ్ ఇంటెగ్రిటీ యూనిట్ హెడ్ అలెక్స్ మార్షల్ చెప్పారు.
శామ్యూల్స్ కెరీర్ విషయానికి వస్తే 18 సంవత్సరాలు వెస్టిండీస్ జట్టులో కొనసాగాడు. అంతర్జాతీయ కెరీర్‌లో 300 పైగా మ్యాచ్ లాడిన శ్యామ్యూల్స్.. మొత్తం 17 సెంచరీలు చేశాడు. వన్డే కెరీర్ లో విండీస్ జట్టుకు కెప్టెన్ గా చేసిన అనుభవం కూడా ఉంది. 2012 వరల్డ్ కప్ ఫైనల్లో శ్రీలంకపై వీరోచిత ఇన్నింగ్స్ ఆడి వెస్టిండీస్ కు ఒంటి చేత్తో తొలిసారి టీ 20 ప్రపంచ కప్ అందించాడు.