గత ఐదు నెలల్లోనే ఏదో చేశానని చెప్పడంలేదు. కొద్ది కొద్దిగా పారిశ్రామిక వేత్తల్లో నమ్మకాన్ని కల్పిస్తున్నాం అని సీఎం చంద్రబాబు అన్నారు. మళ్లీ దుర్మార్గ ప్రభుత్వం వస్తే ఎలాగని వారు జంకుతున్నారు. అయితే, ఆంధ్రులు విజ్ఞులు అని, ఇక భవిష్యత్తులో ఎప్పటికీ వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని.. వారికి నచ్చజెప్పి ఒక్కో కంపెనీని తీసుకొస్తున్నాం. ధైౖర్యంగా పెట్టుబడులు పెట్టండి భరోసా మాది.. అని చెబుతున్నాం. నా దగ్గర డబ్బుల్లేవు కానీ నూతన ఆలోచనలు ఉన్నాయి. ఓ మంచి ఆలోచన ప్రపంచాన్నే మారుస్తుంది. అటువంటి ఆలోచనతో ముందుకెళ్లి సంపద సృష్టిద్దాం అని పిలుపునిచ్చారు.