యూపీలోని బిజ్నోర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ధాంపూర్‌లోని తిబ్డి గ్రామంలో నివాసముంటున్న మగ పెళ్లివారి కుటుంబం జార్ఖండ్‌కు చెందిన వధువుతో కలిసి తమ ఇంటికి తిరిగి వస్తుండగా శనివారం ఉదయం కారు, టెంపో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వధూవరులతో సహా ఏడుగురు మృతి చెందారు. పెళ్లి దుస్తుల్లో విగతజీవులుగా మారిన నూతన దంపతులను చూసి వారి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. కాగా, దట్టమైన పొగమంచు కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు.