నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యాన్ని పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం చంద్రబాబు కోరారు. అదేవిధంగా గోదావరి-పెన్నా నదుల అనుసంధానానికి కూడా సహకరించాలని విన్నవించారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌లతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వారితో చర్చించారు.