జింబాబ్వే టీ20 కెప్టెన్ సికిందర్ రజా చరిత్ర సృష్టించాడు. పొట్టి క్రికెట్లో హ్యాట్రిక్ తీసిన తొలి జింబాబ్వే బౌలర్గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ ఆఫ్రికా క్వాలిఫయర్లో భాగంగా రువాండ్తో జరిగిన మ్యాచ్లో రజా వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు తీశాడు. మొత్తం హ్యాట్రిక్ తీసిన మూడో జింబాబ్వే ఆటగాడిగా రజా నిలిచాడు.