భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను కొనసాగిస్తున్నట్లు బీసీసీఐ బుధవారం ప్రకటించింది. ద్రవిడ్‌తో పాటు సహాయక సిబ్బంది కాంట్రాక్టులను పొడిగిస్తున్నట్లు తెలిపింది. వన్డే ప్రపంచకప్‌తో జట్టు కోచ్‌గా ద్రవిడ్ కాంట్రాక్టు ముగిసింది. అయితే ఆయన కోచ్‌గా కొనసాగేందుకు విముఖత చూపారు. లక్ష్మణ్‌ను కోచ్‌గా నియమించనున్నారనే ప్రచారం సాగింది. చివరికి ద్రవిడ్‌నే కొనసాగిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.