టీమిండియా హెడ్ కోచ్ పదవిపై ఉత్కంఠ వీడింది. టీమిండియా కోచ్‌గా కొనసాగేందుకు ‘మిస్టర్ డిపెండబుల్’ రాహుల్ ద్రవిడ్ అంగీకరించాడు.ఈ విషయాన్ని బీసీసీఐ బుధవారం అధికారికంగా వెల్లడించింది. టీమిండియా (సీనియర్ మెన్) హెడ్ కోచ్ మరియు సపోర్ట్ స్టాఫ్ కాంట్రాక్ట్‌లను పొడిగించాం అని బీసీసీఐ తన ఎక్స్‌లో పేర్కొంది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.