భారత మహిళల డబుల్స్ జంట అశ్వినీ పొన్నప్ప, తనీష క్రాస్టో బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటారు. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తున్న పొన్నప్ప, తనీషా జోడీ నాలుగు స్థానాలు ఎగబాకి 28వ ర్యాంక్ దక్కించుకుంది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి ద్వయం రెండో సీడ్ నిలబెట్టుకుంది. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు 12వ ర్యాంకుతో సరిపెట్టుకుంది.