మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్‌కు సిద్ధమవుతోంది. డిసెంబర్ 9న రెండో సీజన్ మినీ వేలం జరుగనుంది. ఈ వేలానికి బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ముంబైలోని గ్రాండ్ హయత్‌లో డబ్ల్యూపీఎల్-2024 మినీ వేలం జరుగనుంది. తొలి సీజన్ వేలాన్ని నిర్వహించిన మల్లికా సాగర్‌కే మరోసారు బీసీసీఐ బాధ్యతలు అప్పగించింది.
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలం ఈ నెల 9న ముంబైలో జరగనుంది. రాబోయే సీజన్ కోసం మొత్తం 165 మంది ఆటగాళ్లను వేలం వేయనున్నారు. ఇందులో 104 మంది భారత క్రికెటర్లు, 61 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. జాబితాలో ఉన్న క్రికెటర్లలో 56 మంది క్యాప్డ్ ప్లేయర్లు కాగా, 109 మంది అన్ క్యాప్డ్ ప్లేయర్లు.