ఇంగ్లాండ్ మహిళల జట్టుతో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో భారత్ గెలిచి పరువు నిలబెట్టుకుంది. మొదటి రెండు మ్యాచుల్లో ఓటమిపాలై సిరీస్ను చేజార్చుకున్న టీమిండియా చివరి మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 126 పరుగులకే ఆలౌటైంది. ఈ స్వల్ప లక్ష్యాన్ని భారత జట్టు 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. స్మృతి మంధాన 48, జెమీమా రోడ్రిగ్స్ 29 పరుగులు చేశారు.