12 ఏళ్లుగా నిలిచిపోయిన జోనల్ క్రికెట్‌ను తిరిగి ఆదివారం ప్రారంభించామని హెచ్ సి ఏ అధ్యక్షుడు జగన్మోహన్రావు తెలిపారు. ఈ జోనల్ స్థాయి టోర్నీని పునరుద్ధరించడానికి హెచ్ సి ఏ నూతన కార్యవర్గం చర్యలు తీసుకుందని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. క్రికెటర్లను ఖాళీగా ఉంచకుండా ఏడాది పొడవునా ఏదో ఒక టోర్నీ ఆడించడానికి కసరత్తులు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.