బంగ్లాదేశ్ స్టార్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హాసన్ ఐపీఎల్-2024 నుంచి తప్పుకుని షాకిచ్చాడు. ఈనెల 19న దుబాయ్లో జరగనున్న మినీ వేలం కోసం షకీబ్ తన పేరును రిజిస్టర్ చేసుకోలేదు. ‘నేను ఐపీఎల్ ఆడేందుకు సిద్ధంగా లేను. పాకిస్థాన్ క్రికెట్ లీగ్లో నా పేరు ఇచ్చినప్పటికే ఉపసంహరించుకున్నాను. భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు. జాతీయ జట్టుకు ఎక్కువ కాలం ఆడాలనే కోరిక నాలో ఉంది. మూడు ఫార్మాట్లలో కొనసాగాలని భావిస్తున్నా’ అని చెప్పాడు.