సంజయ్ సింగ్ డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిగా ఎన్నికవడం వివాదంగా మారింది. అతను లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ కు సన్నిహితుడు కావడమే దీనికి కారణం.
సంజయ్ ఎన్నికను నిరసిస్తూ ఇప్పటికే సాక్షి మలిక్, బజ్రంగ్ పునియా వారి అభిప్రాయాలు తెలిపారు. తాజాగా, పారా రెజ్లర్ వీరేందర్ సింగ్ సైతం వీరికి మద్దతు తెలిపారు. ‘ నా సోదరి కోసం నేను కూడా నా పద్మశ్రీని తిరిగి ఇచ్చేస్తాను' అని ట్వీట్ చేశారు.