తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి భద్రాద్రి పవర్ ప్లాంట్‌కు బయల్దేరారు. అక్కడ పవర్ ప్లాంట్‌ను పరిశీలించి అధికారులతో ఆయన సమీక్ష సమావేశం జరపనున్నారు. ఇప్పటి వరకు ప్రాజెక్టు పూర్తి కాకపోవడం, పనులు ఎంతవరకు వచ్చాయన్న విషయాలపై సమావేశంలో చర్చించనున్నారు. కాగా, తెలంగాణ ఏర్పడిన తర్వాత మణుగూరులో భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టారు.