క్రికెట్లో ఓ వింత రూల్ ఉంది. ఫీల్డింగ్ అప్పీల్ చేయనంత వరకూ ఓ అంపైర్. బ్యాట్స్‌మన్‌ను ఔట్ ఇవ్వడానికి వీల్లేదు. అది కచ్చితంగా ఔటే అని అంపైర్ భావించినా. ఫీల్డింగ్ టీమ్ అప్పీల్ చేస్తేనే ఔటివ్వాలి. అయితే ఆ మధ్య ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో అంపైర్ క్రిస్ గఫానీ పుజారాను ఔటిచ్చినట్లుగానే వేలు పైకెత్తినా ఆ తర్వాత ఫీల్డింగ్ సైడ్ నుంచి ఎలాంటి అప్పీల్ లేకపోవడంతో మౌనంగా ఉండిపోయాడు.