భారత ఓపెనర్ శుభ్‌మన్ గిల్ తన దూకుడును తగ్గించుకోవాలని దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ అన్నారు. దక్షిణాఫ్రికాతో మొదటి టెస్టులో గిల్ రెండు ఇన్సింగ్లోనూ విఫలమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గవాస్కర్ మాట్లాడుతూ.. ‘టెస్టు క్రికెట్లో గిల్ చాలా దూకుడుగా ఆడుతున్నాడు. టీ20, వన్డేలతో పోల్చుకుంటే టెస్టు క్రికెట్ కాస్త భిన్నమైంది. ఆ విషయాన్ని గిల్ గుర్తించాలి. తిరిగి ఫామ్‌లోని రావాలని ఆశిస్తున్నాం అని అన్నారు.