ఉగాండాకు చెందిన మారథాన్ రన్నర్ బెంజమిన్ కిప్లగత్ హత్యకు గురయ్యాడు. కెన్యాలోని ఎల్డొరెట్ ప్రాంతంలో ఒక కారులో అతడి మృతదేహం లభించింది. బెంజమిన్ ఛాతి, మెడపై కత్తిపోట్లు ఉన్నాయని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం గాలిస్తున్నామని అన్నారు. కాగా, ఉగాండా తరఫున బెంజమిన్ మూడు సార్లు ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొన్నాడు.