కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికా-భారత్ మధ్య రెండో టెస్టు రసవత్తరంగా జరిగింది. ఇరు జట్ల పేసర్లు చెలరేగుతున్నారు. ఫలితంగా తొలి రోజే 23 వికెట్లు నేలకూలాయి. దీనిపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించారు. ‘ఈ ఏడాది 23 వికెట్లతో క్రికెట్ ఆరంభమైంది. సౌతాఫ్రికా ఆలౌట్ అయినప్పుడు నేను ఫ్లైట్ ఎక్కాను. ఇంటికి వచ్చి చూస్తే సౌతాఫ్రికా 3 వికెట్లు కోల్పోయి బ్యాటింగ్ చేస్తోంది. నేనేం మిస్సయ్యాను అని ఎక్స్‌లో ట్విట్ చేశాడు.