శ్రీలంక-జింబాబ్వే మధ్య మూడు వన్డేల సిరీస్లో భాగంగా శనివారం జరిగిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మొదట లంక 50 ఓవర్లలో 9 వికెట్లకు 273 పరుగులు చేసింది. అసలంక (101; 95 బంతుల్లో 5×4, 4×6) శతకంతో మెరిశాడు. కుశాల్ మెండిస్ (46), సమరవిక్రమ (41) రాణించారు. ఛేదనలో జింబాబ్వే 4 ఓవర్లకు 12/2తో ఉన్నప్పుడు వర్షం మొదలైంది. ఆ తర్వాత ఆగకపోవడంతో మ్యాచ్ సాగలేదు. అప్పటికి కైటానో (1), మిల్టన్ (2) క్రీజులో ఉన్నారు.