హార్దిక్ పాండ్యా గాయపడటంతో రోహిత్ శర్మకు టీమ్ ఇండియా పగ్గాలు అందిస్తారని ముందే ఊహించానని దిగ్గజ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సోమవారం అన్నారు. వరల్డ్ కప్‌లో హార్దిక్ పాండ్యా గాయపడటంతో అతడు కెప్టెన్‌గా ఉండడని ముందే పసిగట్టానన్నారు. పాండ్యా నేరుగా ఐపీఎల్లో ఆడే అవకాశం ఉందన్నారు. ఒక వేళ గాయాల నుంచి కోలుకొని.. ఫిట్నెస్ సాధిస్తే అతను టీ20 వరల్డ్ కప్‌లో వస్తాడని, లేకుంటే రోహిత్‌కే కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగిస్తారన్నారు.