కురుల పోషణకి చాలా రకాల నూనెలనే వాడుతుంటాం కదా? ఈసారి గ్రేప్ సీడ్ ఆయిల్ని ప్రయత్నించి చూడండి. శీతకాలంలో జుట్టు రాలడం, చుండ్రు, చిట్లిపోవడం వంటి ఎన్నో సమస్యలకు ఇది చెక్ పెట్టేయగలదు. విటమిన్ ఇ, లినోలిక్ యాసిడ్లు కురులు ఆరోగ్యంగా పెరిగేలా చేస్తాయి. దీనిలో అధిక మొత్తంలో ఉండే న్యూట్రియంట్లు, యాంటీ ఆక్సిడెంట్లు, మంచి కొవ్వులు కురులకు కావాల్సిన పోషణను అందించి వేగంగానే కాదు, దృఢంగా ఎదిగేలా చూస్తాయి.