చలికాలంలో వేడి పానియాలు తీసుకుంటే శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయట. అలాగే శరీరంలోని కేలరీలు కరిగేలా చేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. ఒక గ్లాస్ వేడి నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకుని తాగితే విటమిన్ సి అందుతుంది. ఇది కడుపుని శుభ్రపరిచి, జీవక్రియను పెంచుతుంది. గ్రీన్ టీ చలికాలంలో వెచ్చగా ఉండటానికి, బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది. మధుమేహంతో బాధపడేవారు దాల్చిన చెక్కతో తయారు చేసిన టీ తాగితే మంచి ఫలితాలుంటాయి.