ఎక్కువగా ఎండాకాలం శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు డీ హైడ్రాషన్ వస్తుంది. దీన్ని అదుపులో ఉంచుకోవడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. నీరు, సగ్గు బియ్యం, బార్లీ చేరిన గంజి, మజ్జిగ, కొబ్బరి బోండం నీరు ఎక్కువగా తీసుకోవాలి. తేలికగా జీర్ణమయ్యే ఇడ్లీ, రాగి మాల్ట్ , కిచిడి వంటివి తీసుకోవాలి. ఘన పదార్ధాలు కాకుండా ద్రవ పదార్ధాలు ఎక్కువగా ఇవ్వాలి. ఎండ వేడి భరించలేక చాలా మంది శీతలపానీయాలు తీసుకుంటారు.. అలా తీసుకోకూడదు.