వైజాగ్ టెస్టులో భారత్ విజయం సాధించి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ క్రమంలో ఇంగ్లండ్‌తో మిగిలిన 3 టెస్టులకు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ మంగళవారం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ముంబైలో సమావేశం కానుంది. ఈ సమావేశంలో జట్టు ఎంపికతో పాటు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. ఈ జట్టు ఎంపికలో కోహ్లి ఉంటాడా లేదా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25లో ఆస్ట్రేలియా ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడింది. అందులో 6 మ్యాచ్ ల్లో గెలిచి, 3 మ్యాచ్ ల్లో ఓడిపోయింది. మరొకటి డ్రాగా ముగిసింది. విన్నింగ్ పర్సంటేజ్ ని లెక్కేస్తే 66 పాయింట్లతో, 55 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో ఉన్న టీమిండియా 6 మ్యాచ్‌ల్లో 3 గెలిచి, 2 ఓడిపోయింది. ఒకటి డ్రాగా ముగిసింది. ఇలా మొత్తం 38 పాయింట్లు, 52.77 విజయం శాతంతో రెండో స్థానంలో ఉంది.