అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో శ్రీలంక 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అఫ్గాన్ తొలి ఇన్నింగ్స్‌లో 198 పరుగులు చేయగా.. లంక 439 రన్స్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో అఫ్గాన్ 296 పరుగులు చేసి ప్రత్యర్థి ముందు 56 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచిది. దీంతో లంక అలవోకగా టార్గెట్ చేజ్ చేసింది. ఈ టెస్టులో 8 వికెట్లు తీసిన ప్రభాత్ జయసూర్యకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో అఫ్గానిస్థాన్ 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లంక 49.3 ఓవర్లలో 241 పరుగులకే కుప్పకూలింది. పతున్ నిస్సాంక (46), కుశాల్ మెండిస్ (39), సదీర సమరవిక్రమ (36) ఫర్వాలేదనిపించారు. చివర్లో ఏంజెలో మాథ్యూస్ (23), తీక్షణ్ (29) విలువైన పరుగులు చేశారు. అఫ్గాన్ బౌలర్లలో ఫజల్ హక్ 4 వికెట్లు తీశాడు. ముజీబ్ రెండు వికెట్లు తీశాడు. ఆ తర్వాత ఆఫ్ఘనిస్థాన్ 45.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. అజ్మతుల్లా ఒమర్జాయ్ (73 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), రహ్మత్ షా (62; 7 ఫోర్లు), కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ (58 నాటౌట్) అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. లంక బౌలర్లలో మధుశనక 2 వికెట్లు తీశాడు. ఫజల్ హక్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది.