అండర్ -19 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో భారత జట్టు అతికష్టం మీద గెలిచి ఫైనల్ చేరింది. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా బౌలింగ్, మెరుపు ఫీల్డింగ్‌తో భారత్ 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. కీలక సమయంలో యువ కెరటం సచిన్ ధాస్ కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ ఉదయ్ సహరన్ తో కలిసి భారత్ ను గెలుపు వాకిట నిలిపాడు. అతడి ఆట చూసిన వాళ్లంతా జూనియర్ సచిన్ దొరికేశాడంటూ నెట్టింట కామెంట్లు చేస్తున్నారు.
అయితే అండర్-19 వరల్డ్ కప్ లో భారత్ జట్టు ఆధిపత్యం కొనసాగుతోంది. మంగళవారం సెమీఫైనల్లో విజయంతో ఈ టోర్నీ చరిత్రలో అత్యధికంగా 9 సార్లు ఫైనల్ కు చేరిన జట్టుగా నిలిచింది. 2000, 2008, 2012, 2018, 2022 ఫైనల్లో కుర్రాళ్ల జట్టు విజేతగా నిలిచింది. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచులోనూ ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఇదే సూపర్ ఫామ్ తో ఫైనల్లోనూ గెలవాలని అభిమానులు కోరుతున్నారు.