సౌతాఫ్రికాతో సొంతగడ్డపై జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ సూపర్ విక్టరీ సాధించింది. 281 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. సుదీర్ఘ ఫార్మాట్‌లో సఫారీలపై కివీస్‌కు ఇదే పెద్ద విజయం కావడం గమనార్హం. 1994లో జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన టెస్టులో కివీస్ 137 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది.
528 పరుగుల భారీ ఛేదనలో ఆల్ రౌండర్ కైల్ జేమీసన్ నాలుగు వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికాను ఓటమి అంచుకు నెట్టాడు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో డేవిడ్ బెడింగన్ (87) ఒక్కడే హాఫ్ సెంచరీతో పోరాడినా జట్టును గెలిపించలేకపోయాడు. సాంట్నర్ చివరి వికెట్ తీయడంతో సఫారీ జట్టు ఇన్నింగ్స్ 247 పరుగుల వద్ద ముగిసింది. డబుల్ సెంచరీతో చెలరేగిన యువ ఓపెనర్ రచిన్ రవీంద్ర (240)కి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఈ విజయంతో కివీస్ రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.