ఐదోసారి అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరుకోవడంపై భారత కెప్టెన్ ఉదయ్ సహరన్ ఆనందం వ్యక్తం చేశాడు. స్వల్ప వ్యవధిలో కీలకమైన నాలుగు వికెట్లను కోల్పోయిన టీమ్‌ఇండియాను సచిన్ దాస్‌తో కలిసి సహరన్ గెలిపించాడు. ’’సచిన్ దాస్‌తో ఒకటే చెప్పా. చివరి వరకూ క్రీజ్‌లో ఉండేందుకు ప్రయత్నించు. నేనూ ఉంటా. నువ్వూ ఉండు. అప్పుడు మ్యాచ్ గెలవడం తేలికవుతుందని చెప్పా. అదే చేసి చూపించాం‘‘ అని సహరన్ వెల్లడించాడు.
ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా బౌలింగ్, మెరుపు ఫీల్డింగ్‌తో భారత్ 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. కీలక సమయంలో యువ కెరటం సచిన్ ధాస్ కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ ఉదయ్ సహరన్ తో కలిసి భారత్ ను గెలుపు వాకిట నిలిపాడు. అతడి ఆట చూసిన వాళ్లంతా జూనియర్ సచిన్ దొరికేశాడంటూ నెట్టింట కామెంట్లు చేస్తున్నారు.