టీమ్‌ఇండియా పేసర్ బుమ్రాపై దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం డివిలీయర్స్ ప్రశంసలు కురిపించాడు. ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో అద్భుత ప్రదర్శన చేసి ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ ర్యాంక్ సాధించడంపై ఏబీ స్పందించాడు. ‘బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. స్వింగ్ నైపుణ్యంతో మిగతా భారత బౌలర్లను అతను అధిగమించాడు. బుమ్రా అమ్ములపొదిలో యార్కర్ ప్రధాన అస్త్రం’ అని అన్నాడు.
వైజాగ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్ 106 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో టీమిండియా 1-1తో సిరీస్‌ను సమం చేసింది. భారత స్టార్ ఆటగాళ్లు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యారు. తొలి టెస్టులో వీరిద్దరూ వైజాగ్ టెస్ట్‌కు అందుబాటులో లేరు.
కాగా రాహుల్, జడ్డూ ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఉన్నారు. తమ ఫిట్‌నెస్‌ను తిరిగి పొందేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో జడేజా తన గాయం గురించి అభిమానులతో పంచుకున్నాడు. జడ్డూ సోషల్ మీడియాలో ఒక ఫోటోను పంచుకున్నాడు మరియు గాయం నుండి త్వరగా కోలుకుంటున్నట్లు చెప్పాడు. నా ఆరోగ్యం మెరుగవుతోంది' అంటూ క్యాప్షన్ రాసుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగే మిగిలిన రెండు టెస్టుల కోసం భారత జట్టును గురువారం బీసీసీఐ ప్రకటించే అవకాశం ఉంది.