వెస్టిండీస్‌తో హోబర్ట్‌లో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా వెటరన్ ఆటగాడు డేవిడ్ వార్నర్ చెలరేగిపోయాడు. కెరీర్‌లో 100వ టీ20 ఆడుతున్న వార్నర్.. కేవలం 22 బంతుల్లోనే 9 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో అద్భుత అర్ధసెంచరీని కొనసాగిస్తున్నాడు. వార్నర్ విధ్వంసకర ఇన్నింగ్స్ తో చెలరేగడంతో ఆసీస్ కేవలం 9.1 ఓవర్లలోనే 100 పరుగుల మార్కును దాటేసింది.
ఓపెనర్‌గా బరిలోకి దిగిన జోష్ ఇంగ్లిస్ 39 పరుగులు (5 ఫోర్లు, సిక్స్) చేసి ఔట్ కాగా.. వార్నర్ (57), మిచెల్ మార్ష్ (11) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ వికెట్ జాసన్ హోల్డర్‌కు దక్కింది. 10 ఓవర్ల తర్వాత ఆస్ట్రేలియా స్కోర్ 110/1. కాగా, కోవిడ్‌తో బాధపడుతున్నప్పటికీ ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ ఈ మ్యాచ్‌ను ఆడుతున్నాడు. కోవిడ్ నిర్ధారణ కారణంగా టాస్‌కు మార్ష్ స్థానంలో వార్నర్ వచ్చాడు.