బంగారం కొనేవారికి స్వల్ప ఊరట లభించింది. దేశంలో బంగారం ధరలు ఇవాళ స్థిరంగా నమోదయ్యాయి. మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,700 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,950గా నమోదైంది. ఇక వెండి ధరలు కూడా స్థిరంగానే కొనసాగుతున్నాయి. కేజీ వెండి ధర రూ.76,500లుగా పలుకుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ పసిడి ధరలు తగ్గగా.. వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.210 తగ్గి రూ.62,950గా ఉంది. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.200 తగ్గటంతో రూ.57,700 ఉంది. కాగా, కిలో వెండి ధర రూ.76,500గా ఉంది.