టీమిండియాతో మూడో టెస్టుకు ఇంగ్లండ్ తమ తుదిజట్టును ప్రకటించింది. రాజ్‌కోట్ మ్యాచ్‌లో తాము ఒక మార్పుతో బరిలోకి దిగనున్నట్లు వెల్లడించింది.ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేసింది.కాగా యువ స్పిన్నర్ షోయబ్ బషీర్‌పై వేటు పడగా.. రైటార్మ్ పేసర్ మార్క్ వుడ్ తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇక ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ గెలుపొందిన విషయం తెలిసిందే.ఈ మ్యాచ్‌లో.. ఒకే ఒక్క ఫాస్ట్‌బౌలర్ మార్క వుడ్‌తో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. తర్వాతి మ్యాచ్‌లో దిగ్గజ బౌలర్ జేమ్స్ ఆండర్సన్‌కు పిలుపునిచ్చింది. మార్క్‌వుడ్ స్థానాన్ని ఆండర్సన్‌తో భర్తీ చేయడంతో పాటు.. గాయపడిన సీనియర్ స్పిన్నర్ జాక్ లీచ్ స్థానంలో షోయబ్ బషీర్‌తో అరంగేట్రం చేయించింది.ఈ క్రమంలో విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టులో ఆండర్సన్ ఐదు వికెట్లు తీయగా.. బషీర్ నాలుగు వికెట్లతో అదరగొట్టాడు. కానీ ఈ మ్యాచ్‌లో టీమిండియా చేతిలో ఇంగ్లండ్ 106 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది.ఈ నేపథ్యంలో.. రాజ్‌కోట్ వేదికగా ఇద్దరు ఫాస్ట్‌బౌలర్లతో బరిలో దిగాలని భావించిన ఇంగ్లండ్.. బషీర్‌పై వేటు వేసి మార్క్ వుడ్‌ను మళ్లీ పిలిపించింది. ఇక టీమిండియా- ఇంగ్లండ్ మధ్య గురువారం(ఫిబ్రవరి 15) నుంచి గుజరాత్‌లోని రాజ్‌కోట్ వేదికగా మూడో టెస్టు ఆరంభం కానుంది.
టీమిండియాతో మూడో టెస్టుకు ఇంగ్లండ్ తుది జట్టు:
జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, జానీ బెయిర్ స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్, రెహాన్ అహ్మద్, టామ్ హార్లే, మార్క్ వుడ్, జేమ్స్ అండర్సన్.