ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ లంచ్ విరామ సమయానికి 3 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ రోహిత్ శర్మ(52*), రవీంద్ర జడేజా(24*) ఉన్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. వైజాగ్ టెస్టులో డబుల్ సెంచరీ చేసిన ఓపెనర్ యశస్వి జైస్వాల్ (10) మార్క్ వుడ్ బౌలింగ్‌లో జో రూట్ స్లిప్ వద్ద చక్కటి క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. అనంతరం గిల్ (0)ను శుభ్‌మన్ డకౌట్‌గా ఔట్ చేశాడు. వైజాగ్ టెస్టులో ఆకట్టుకున్న రజత్ పాటిదార్ (5)ను టామ్ హర్ట్లీ అవుట్ చేసి భారత్ ను మరింత కష్టాల్లోకి నెట్టాడు.
33 పరుగులకే మూడు కీలక వికెట్లు పడిపోవడంతో ఇంగ్లండ్ జట్టు మ్యాచ్ పై పట్టు సాధించింది. అయితే.. కెప్టెన్ హిట్ మ్యాన్ సహజమైన ఆటను పక్కనపెట్టి నెమ్మదిగా ఆడుతూ.. రవీంద్ర జడేజాతో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దాంతో తొలి సెషన్ లోనే స్టోక్స్ మరో వికెట్ పడేలా బౌలర్లను మార్చేసినా ఫలితం లేకపోయింది. ఇంగ్లండ్ బౌలర్లలో వుడ్ 2 వికెట్లు, హార్టీ ఒక వికెట్ తీశారు.