క్రికెటర్లకు ప్రతి మ్యాచ్‌కి ముందు ఆయా దేశాల క్రికెట్ బోర్డులు ఓ క్యాప్ అందజేస్తాయి. క్రికెటర్లు తమ తొలి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడే ముందు డెబ్యూ క్యాప్ అందుకుంటారు. ఆ తర్వాత ప్రతి మ్యాచ్‌కో క్యాప్ అందుకుంటారు. కాగా అంతర్జాతీయ క్రికెట్‌లో ఎక్కువ క్యాప్స్ అందుకున్న రికార్డు సచిన్ పేరిట ఉంది. సచిన్.. టెస్టుల్లో 200, వన్డేల్లో 463, టీ20లో 1 క్యాప్స్ అందుకున్నారు. అయితే క్యాప్ కచ్చితంగా ధరించాలనే నిబంధనలేం లేవు.