గత పదేళ్లలో దేశీయంగా తయారైన సెల్‌ఫోన్ల తయారీ విలువ రూ. 20 లక్షల కోట్లకు చేరుకోనున్నదని ఇండస్ట్రీ బాడీ ఐసీఈఏ గురువారం వెల్లడించింది.
ప్రస్తుతానికి దేశంలో 245 కోట్ల యూనిట్ల మొబైళ్లు ఉత్పత్తి కాగా వాటి విలువ రూ.19,45,100 కోట్లకు చేరుకున్నదని తెలిపింది. 2014-15లో రూ.18, 900 కోట్లుగా ఉన్న మొబైల్ ఫోన్ల ఉత్పత్తి 2023-24 నాటికి 2 వేల శాతం పెరిగి రూ. 4,10,000 కోట్లకు చేరుకున్నదని పేర్కొంది.