భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లో భాగంగా ధర్మశాల వేదికగా చివరిదైన ఐదో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. భారత ఆటగాళ్లు పరుగుల వరద కురిపిస్తున్నారు. శివరాత్రి రోజున శివుడు మేల్కొన్నాడు. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఇంగ్లండ్ బౌలింగ్‌లో చెలరేగి సెంచరీలు నమోదు చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత సెంచరీ చేశాడు. 154 బంతుల్లో 100 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. టెస్టు కెరీర్‌లో 12 సెంచరీలు చేశాడు.
రోహిత్ శర్మ సెంచరీ చేసిన వెంటనే, ఆ తర్వాతి ఓవర్లో టీమిండియా యువ స్టార్ శుభ్‌మన్ గిల్ కూడా సెంచరీ సాధించాడు. సూపర్ సిక్సర్లతో సెంచరీ పరుగులు పూర్తి చేయడం విశేషం. ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ 101 పరుగులతో క్రీజులో ఉన్నాడు. గిల్ తన ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 5 సిక్సర్లు బాదాడు. లంచ్ విరామ సమయానికి రోహిత్ శర్మ (102*), గిల్ (101*) క్రీజులో ఉండడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 264/1 (60)తో నిలిచింది. అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులకు ఆలౌటైంది. ప్రస్తుతం భారత్ 46 పరుగుల ఆధిక్యంలో ఉంది.