ఇంగ్లండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ చరిత్ర సృష్టించారు. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో 700 వికెట్లు తీసిన తొలి పేస్ బౌలర్‌గా నిలిచారు. 187 టెస్టుల్లో అండర్సన్ ఈ ఫీట్ సాధించారు. ధర్మశాల వేదికగా జరుగుతున్న టెస్టులో భారత క్రికెటర్ కుల్ధీప్ యాదవ్‌ను ఔట్ చేయటంతో ఈ రికార్డు నమోదైంది. కాగా మురళీ ధరన్(శ్రీలంక-800 వికెట్లు), షేన్ వార్న్(ఆస్ట్రేలియా-708 వికెట్లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
అండర్సన్ 2002లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. మరుసటి ఏడాది టెస్టుల్లోకి అడుగు పెట్టిన అండర్సన్ ఇప్పటివరకు 187 టెస్టులు ఆడాడు. 32 సార్లు 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. ఇంగ్లండ్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గానూ నిలిచాడు.