సన్నగా ఉన్నవారు బరువు పెరిగేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తారు. అలాంటివారు ఖర్జూరాలను తింటే బరువు పెరగవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే పరగడుపున,
రాత్రి పడుకునే ముందు రోజుకు నాలుగు ఖర్జూరాలను నెయ్యితో కలిపి తింటే బరువు పెరగవచ్చు. ఖర్జూరాలను నానబెట్టి తింటే రక్తహీనత సమస్య ఉండదు. గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. ఎముకలు బలంగా మారతాయి.