ఐఫోన్ యూజర్లను సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టిస్తున్నారు. రీసెట్ పాస్వర్డ్ అంటూ మెసేజ్ లు పంపి యాపిల్ కస్టమర్ కేర్ నంబర్ నుంచే ఫోన్ చేస్తున్నారు. 'మీ ఫోన్ ను ఎవరో హ్యాక్ చేస్తున్నారు. వారి నుంచి రక్షిస్తాం.
ఓటీపీ చెప్పండి' అని మోసాలకు పాల్పడుతున్నారు. ఈ సమయంలో OTP షేర్ చేస్తే మన వ్యక్తిగత సమాచారమంతా వారి చేతుల్లోకి వెళ్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.