తెలంగాణలో 2024-25 విద్యా సంవత్సరంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు జూన్ 5, 6 తేదీల్లో నిర్వహించిన ‘టీజీ ఐసెట్-24’ ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను హైదరాబాద్‌లోని రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మధ్యాహ్నం 3.30 గంటలకు విడుదల చేయనున్నారు. కాకతీయ వర్సిటీ ఇన్‌ఛార్జి వీసీ వాకాటి కరుణ, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి తదితరులు ఈ ఫలితాలను విడుదల చేస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa