ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో యూపీఐ పేమెంట్లు, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ల హవా నడుస్తోంది. దాదాపు అందరూ యూపీఐ పేమెంట్స్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. స్మార్ట్‌ఫోన్స్‌లో ఫోన్ పే, గూగుల్ పే వంటి అప్లికేషన్లు కచ్చితంగా ఉంటున్నాయి. అయితే వీటి మధ్య గట్టి పోటీ నడుస్తోంది. ఈ నేపథ్యంలో తమ యూజర్లకు బెస్ట్ యూపీఐ పేమెంట్ సర్వీసులు అందించేందుకు గూగుల్ పే కొత్త ఫీచర్లను ప్రకటించింది. డిజిటల్ పేమెంట్స్‌ను మరింత సులువుగా, వేగంగా మార్చే 6 ఫీచర్ల వివరాలను గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2024లో రివీల్ చేసింది. ఈ కొత్త ఫీచర్లు, వాటి ప్రయోజనాలు చూద్దాం. యూపీఐ సర్కిల్ ఫీచర్‌తో ప్రైమరీ యూపీఐ యూజర్‌తో పాటు, సెకండరీ యూజర్ కూడా అకౌంట్‌ను ఉపయోగించుకోవచ్చు. యూపీఐ యూజర్ 5 కంటే ఎక్కువ సెకండరీ యూజర్లను యాడ్ చేయలేరు. ఈ ఫీచర్‌తో ఒకటి కంటే ఎక్కువ మంది వ్యక్తులు ఒకే యూపీఐ అకౌంట్‌ను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.