ప్రపంచవ్యాప్తంగా సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతికి ముగింపు పలుకుతున్నాయి. తాజాగా టెక్ దిగ్గజం డెల్, సెప్టెంబరు 30 నుండి తమ సేల్స్ టీమ్ ఉద్యోగులను ఆఫీస్‌లకు రావాలని ఆదేశించింది. వారానికి ఐదు రోజుల పాటు ఆఫీస్ నుండి పనిచేయాలని డెల్ ఉద్యోగులను కోరింది. ఉద్యోగులకు సహకార వాతావరణం సృష్టించడం, నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు ఈ మార్పు చేయబడుతున్నదని డెల్ ప్రకటించింది.