సీతాఫలం పండ్లు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. సీతాఫలంలో విటమిన్ C, విటమిన్ A, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. సీతాఫలం తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సాహిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించేందుకు దోహదపడుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది.